Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మరింత క్షీణించనున్న వైసీపీ బలం!... నేడు టీడీపీలోకి కందుకూరు ఎమ్మెల్యే!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే వైసీపీ టికెట్ పై గెలిచిన 18 మంది ఎమ్మెల్యేలు జగన్ కు ఝలక్కిచ్చి అధికార టీడీపీలో చేరిపోయారు. తాజాగా నేడు మరో ఎమ్మెల్యే జగన్ కు షాకివ్వనున్నారు. వెరసి జగన్ పార్టీ బలం నిన్ననే 50 మార్కు కంటే కిందకు దిగగా, తాజాగా నేడు ఆ బలం మరింత తగ్గనుంది. ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గం నుంచి గడచిన ఎన్నికల్లో వైసీపీ టికెట్ పై బరిలోకి దిగి విజయం సాధించిన ఎమ్మెల్యే పోతుల రామారావు నేడు టీడీపీలో చేరనున్నారు. తన అనుచరవర్గంతో కలిసి నేడు విజయవాడకు వెళ్లనున్న రామారావు ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సమక్షంలో టీడీపీలో చేరనున్నారు. రామారావు దూరం కానున్న నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యేల బలం 48కి పడిపోనుంది.

More Telugu News